జింకను కాపాడిన అగ్నిమాపక శాఖ

Fire Department Save Deer In Palamaner Chittoor - Sakshi

చిత్తూరు,పలమనేరు: నీటికోసం వచ్చి మెట్లు లేని బావిలో పడిన జింకను స్థానిక అగ్ని మాపకశాఖ సిబ్బంది రక్షించారు. పట్టణ సమీపంలోని టీఎస్‌ అగ్రహారంలో బావిలో జింక పడిన విషయాన్ని గమనించిన గ్రామానికి చెందిన హనుమంతురెడ్డి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 60 అడుగుల లోతు ఉన్న ఈ బావిలోకి అగ్నిమాపక సిబ్బంది దిగి జింకను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జింక బావిలో పడిందని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top