కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో పొగాకు పంట దగ్ధమైంది.
కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో పొగాకు పంట దగ్ధమైంది. వివరాలు...బనగాన పల్లె మండలంలోని జిల్లెల గ్రామానికి చెందిన శివరామిరెడ్డి అనే రైతుకు చెందిన పొగాకు పంటకు బుధవారం ప్రమాదవశాత్తు నిప్పుంటుకుని పూర్తిగా కాలిపోయింది. పంట విలువ రూ.4 లక్షలు ఉంటుందని స్థానికులు తెలిపారు. నంద్యాల నుంచి ఫైర్ ఇంజిన్ రాక ఆలస్యం కావడంతో పంట పూర్తిగా కాలిపోయిందని సంబంధిత రైతు వాపోయాడు.
(బనగానిపల్లె)