రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి | Father and Son died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

Jan 28 2015 9:29 PM | Updated on Sep 2 2017 8:25 PM

ఆగివున్న లారీని మోటార్‌బైక్‌ ఢీకొని తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి 9 గంటలకు జరిగింది.

వెంకటగిరి (నెల్లూరు జిల్లా) : ఆగివున్న లారీని మోటార్‌బైక్‌ ఢీకొని తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి 9 గంటలకు జరిగింది. వెంకటగిరి- రాపూరు జాతీయ రహదారిలో లింగసముద్రం వద్ద ఆగిఉన్న లారీని మోటార్‌బైక్‌పై వెళ్తున్న తండ్రి కొడుకు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కొడుకు శివ(35) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన తండ్రి రమణయ్య(55) వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించాడు.

డక్కిలి మండలం ఎస్సీ కాలనీకి చెందిన వీరు బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే వెంకటగిరి పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కొనఊపిరితో ఉన్న రమణయ్యను ఆస్పత్రికి చేర్చారు. అయితే చికిత్స అందించేలోపే ఆయన మృతిచెందాడు. శివ శవాన్ని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement