అదే తీరు! | Family planning operation in nizamabad district | Sakshi
Sakshi News home page

అదే తీరు!

Jan 11 2014 3:04 AM | Updated on Sep 2 2017 2:29 AM

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిక్షగా మారుతోంది. సర్కారు దవాఖానాల్లో సరైన వసతులు లేకపోవడంతో ఆపరేషన్ల అనంత రం నేలమీదే పడుకోబెడుతున్నారు.

దేవునిపల్లి, న్యూస్‌లైన్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిక్షగా మారుతోంది. సర్కా రు దవాఖానాల్లో సరైన వసతులు లేకపోవడంతో ఆపరేషన్ల అనంత రం నేలమీదే పడుకోబెడుతున్నారు. దీంతో ఆపరేషన్ చేయించుకున్నవారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కామారెడ్డి ప్రభుత్వ ఏరి యా ఆస్పత్రిలో శుక్రవారం డీపీఎల్ క్యాంపు నిర్వహించారు. 80 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ అనంతరం వారిలో కొందరిని మొదటి అంతస్తులోని పురుషుల వార్డులో, మరికొందరిని వరండాలోని నేలపై పడుకోబెట్టారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
 
 పశువుల హల్‌చల్
 కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోకి సాయంత్రం ఆరు ఆవులు వచ్చి హల్‌చల్ చేశాయి. వాటిని అదిలించగా బెదిరిపోయి పరుగులు తీశాయి. మొదటి అంతస్తులోని పురుషుల, మహిళల వార్డు, ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్లి భయానక వాతావరణాన్ని సృష్టించాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నవారివైపూ రావడం తో వారు భయపడిపోయారు. అయితే అక్కడే ఉన్న ఆస్పత్రి సిబ్బంది వాటిని బయటికి పంపించివేయడంతో ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement