కుటంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
అనంతపురం: కుటంబకలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గార్లెదిన్న మండలం మార్తాడు గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రహీమాన్ అదే గ్రామానికి చెందిన బంధువుల అమ్మాయి షాహిన్(30)ను వివాహం చేసుకున్నాడు. రహీమాన్ గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, కుటుంబకలహాలతో షాహిన్ శనివారం అమ్మగారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నట్టు సమాచారం.