6వేల లీటర్ల కల్తీ నూనె స్వాధీనం | fake oil caught in ysr district | Sakshi
Sakshi News home page

6వేల లీటర్ల కల్తీ నూనె స్వాధీనం

Jan 29 2016 2:24 PM | Updated on Oct 2 2018 8:49 PM

తుది గడువు దాటిపోయిన ఆయిల్ ప్యాకెట్లపై తేది మార్చి విక్రయించేందుకు గొడౌన్‌లో నిల్వ ఉంచారని సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఎర్రగుంట్ల:  తుది గడువు దాటిపోయిన ఆయిల్ ప్యాకెట్లపై తేది మార్చి విక్రయించేందుకు గొడౌన్‌లో నిల్వ ఉంచారని సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో అధికారులు సుమారు 6 వేల లీటర్ల కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు. పట్టబడిన ఆయిల్ విలువ సుమారు రూ. 7.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. వైఎస్సార్‌ కడప జిల్లా ఎర్రగుంట్లలో 3ఎఫ్ కంపెనీకి చెందిన ఆయిల్ గోడౌన్‌లో అక్రమంగా తేదిలు మార్చి నిల్వ ఉంచారని సమాచారం అందడంతో అధికారులు దాడులు చేసి గొడౌన్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement