మద్యం దుకాణం సూపర్‌వైజర్‌ అరెస్టు  | Excise Police Have Arrested a Wine Shop Supervisor in Srikakulam District | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణం సూపర్‌వైజర్‌ అరెస్టు 

Dec 15 2019 10:42 AM | Updated on Dec 15 2019 11:04 AM

Excise Police Have Arrested a Wine Shop Supervisor in Srikakulam District - Sakshi

అరెస్టయిన అప్పలస్వామి, రవిలతో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది

రణస్థలం: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కోటపాలెం మద్యం దుకాణ సూపర్‌వైజర్‌ పాకాడ అప్పలస్వామిని ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇంచార్జి సీఐ ఎ.గణపతిబాబు శనివారం అరెస్టు చేశారు. కోటపాలెం ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా మద్యం సరఫరా అవుతుందనే ఫిర్యాదు మేరకు ఎక్సైజ్‌ సిబ్బంది, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ బి.నర్సింహులు, సిబ్బంది శుక్రవారం నిఘా వేశారు. బైల్టు దుకాణం నడుపుతున్న సుగ్గు రవికి అప్పలస్వామి 48 మద్యం సీసాలను ఒకేసారి విక్రయించాడు. అక్కడే మాటు వేసిన ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు వీరిద్దరినీ పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేశామని ఇన్‌చార్జి సీఐ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రణస్థలం ఎస్‌ఐ బి.బంగారురాజు, సిబ్బంది పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement