ఎంపీడీవోపై మాజీ సీఎం వర్గీయులు దౌర్జన్యం | Ex CM Kiran men attack mpdo in kalikiri | Sakshi
Sakshi News home page

ఎంపీడీవోపై మాజీ సీఎం వర్గీయులు దౌర్జన్యం

Dec 2 2014 11:38 AM | Updated on Jul 29 2019 5:31 PM

చిత్తూరు జిల్లా కలికిరిలో మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి వర్గీయులు మంగళవారం స్థానిక ఎంపీడీవో రాజశేఖరరెడ్డిపై దౌర్జన్యానికి దిగారు.

తిరుపతి: చిత్తూరు జిల్లా కలికిరిలో మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి వర్గీయులు మంగళవారం స్థానిక ఎంపీడీవో రాజశేఖరరెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. రాజశేఖరరెడ్డి తనకు అనుకూలంగా వ్యవహారించడం లేదని ఓ ఉద్యోగి మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి వర్గీయులను ఆశ్రయించాడు. దీంతో వారు రంగంలోకి దిగి.... ఈ రోజు ఉదయం స్థానిక ఎంపీడీవో కార్యాలయం గది నుంచి రాజశేఖరరెడ్డిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. అందుకు ఆయన ససేమిరా అనడంతో బలవంతంగా బయటకు నెట్టి... రాజశేఖరరెడ్డి గదికి తాళం వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement