మిథ్యగా మారిన ఇంజనీరింగ్ విద్య! | Engineering education has turned to the shadow! | Sakshi
Sakshi News home page

మిథ్యగా మారిన ఇంజనీరింగ్ విద్య!

Apr 26 2014 3:09 AM | Updated on Sep 2 2017 6:31 AM

‘లక్షా 13 వేల 300 ఫీజున్న ఓ నంబర్‌వన్ ఇంజనీరింగ్ కాలేజీలో నిబంధనల ప్రకారం 213 మంది అర్హులైన సిబ్బంది ఉండాలి.

95 శాతం కాలేజీల్లో అరకొర సౌకర్యాలు
ఫ్యాకల్టీ లేదు.. ఉన్నా సరైన జీతాల్లేవ్
ఏఎఫ్‌ఆర్‌సీ వెబ్‌సైట్‌లో కాలేజీల వివరాలు
వివరాలు చూసి కాలేజీని ఎంచుకొండి!

 
 హైదరాబాద్: ‘లక్షా 13 వేల 300 ఫీజున్న ఓ నంబర్‌వన్ ఇంజనీరింగ్ కాలేజీలో నిబంధనల ప్రకారం 213 మంది అర్హులైన సిబ్బంది ఉండాలి. కాని అందులో 136 మందే ఉన్నారు. అంటే 77 మంది తక్కువగా ఉన్నారు. అయితే సరైన అర్హతలు లేని ఫ్యాకల్టీ 49 మంది ఉన్నారు. రూ. 97 వేల ఫీజున్న మరో కాలేజీలో 212 మంది సిబ్బంది అవసరం కాగా, అర్హులైన వారు 180 మంది ఉన్నారు. ఇతర ఫ్యాకల్టీ 23 మంది ఉన్నారు. రూ. 85 వేల ఫీజున్న ఇంకొక కాలేజీలో 183 మంది ఫ్యాకల్టీ అవసరం కాగా, 165 మందే ఉన్నారు.’

 ... ఇలా ఏ కాలేజీ పరిస్థితి చూసినా ఏమున్నది గర్వకారణం..పేరుగొప్ప తప్ప సౌకర్యాల లేమి, బోధనాసిబ్బంది కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏ కాలేజీలో ఎంతమంది అర్హులైన సిబ్బంది ఉన్నారు? తమ పిల్లలను ఏ కాలేజీలో చేర్పించవచ్చు? ఎందులో చేర్చితే మెరుగైన విద్యా బోధన అందుతుంది? అనే విషయంలో టాస్క్‌ఫోర్స్ వెబ్‌సైట్ కారణంగా ఓ అవగాహనకు వచ్చే అవకాశం లభించింది.
 ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత గాలికిపోతోంది. అర్హత లేని అధ్యాపకులతో బోధన ఇంజనీరింగ్ విద్య దెబ్బతింటోంది. రాష్ట్రంలో టాస్క్‌ఫోర్స్ కమిటీలు 2012-13 సంవత్సరంలో 686 కాలేజీల్లో తనిఖీలు చేయగా వాటిల్లో 95 శాతం కాలేజీల్లో లోపాలు ఉన్నట్టు తేలింది. ప్రముఖ కాలేజీల్లోనూ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీని నియమించకపోగా, అర్హులైన వారికి వేతనాలు సరిగా చెల్లించడం లేదు. టాస్క్‌ఫోర్స్ తనిఖీల ఆధారంగా ప్రవేశ ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) గత ఏడాది నిర్ధారించిన ఫీజులనే ఆయా కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం (2014-15), ఆ తరువాతి విద్యా సంవత్సరంలో (2015-16) వసూలు చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులను గత ఏడాదే జారీ చేసింది. 175 కళాశాలల్లో రూ. 35,500 నుంచి రూ. 1,13,300 వరకు ఫీజులు ఖరారు చేయగా, మిగితా కాలేజీల్లో రూ. 35 వేల ఫీజును ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఏ కాలేజీల్లో బోధన సిబ్బంది పరిస్థితి ఏంటి? అర్హులైన వారు ఉన్నారా? లేదా? అనే విషయాలను తల్లిదండ్రులు తెలుసుకునే అవకాశాన్ని ఏఎఫ్‌ఆర్‌సీ కల్పించింది. తమ వెబ్‌సైట్‌లో (్చజటఛి.్చఞ.జీఛి.జీ) కాలేజీల ఆదాయ వ్యయ నివేదికలు, ఫ్యాకల్టీ స్థితిగతులను అందుబాటులో ఉంచింది. మే 22న జరిగే ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న 2.80 లక్షల మంది పిల్లలు తల్లిదండ్రులు ఈ వివరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు.
 
95 శాతం కళాశాల ల్లో లోపాలే..!


  టాస్క్‌ఫోర్స్‌కమిటీ నివేదిక మేరకు  95 శాతం కాలేజీల్లో లోపాలు ఉన్నట్టు వెల్లడైంది. ప్రధాన కాలేజీల్లోనూ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ లేరు.దాదాపు 90 శాతం కళాశాలలు బోధన సిబ్బందికి ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఆరో వేతన కమిషన్ పేస్కేలు ఇవ్వడం లేదు. అలాగే, బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 9వ పీఆర్‌సీ వేతనాలు అమలుచేయడం లేదు.కొన్ని కాలేజీలు భారీగా వేతనాలు ఇస్తున్నట్టు  బ్యాంకు ఖాతాల్లో మాత్రమే చూపుతున్నాయి. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉండాల్సి ఉన్నా 75 శాతం కాలేజీల్లో ఆ నిష్పత్తిలో ఫ్యాకల్టీ లేరు. 164 కాలేజీలు మాత్రమే ఆరో వేతన స్కేళ్లను అమలు చేస్తున్నా, అదీ అందరికి ఇవ్వడం లేదు.  ఫ్యాకల్టీకి ఎంటెక్, పీహెచ్‌డీ  అర్హతలు ఉండాల్సి ఉన్నా 70 శాతం ఫ్యాకల్టీ బీటెక్ విద్యార్హతతోనే పనిచేస్తున్నారు. వారికి రూ.6 నుంచి రూ. 10 వేలు చెల్లిస్తూ బోధన కొనసాగిస్తున్నా యి. 60 శాతం కాలేజీల్లో ప్రయోగశాలలు, పరికరాలు లేవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement