ఏపీ ఇరిగేషన్ కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలన్నప్రభుత్వ ఆదేశాలకు నిరసనగా బుధవారం ఉద్యోగ సంఘాలు ధర్నాకు సిద్ధమైయ్యాయి.
హైదరాబాద్: ఏపీ ఇరిగేషన్ కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలన్నప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగ సంఘాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. విజయవాడలో మౌలిక సదుపాయాలు లేకుండా అక్కడకు ఎలా వెళతామని ఇరిగేషన్ ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కనీసం సరైన వసతులు లేకుండా విజయవాడకు వెళ్లలేమని వారు స్పష్టం చేస్తున్నారు.
ఏపీ ఇరిగేషన్ కార్యాలయాన్ని తక్షణమే విజయవాడకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల వివరాలు ఇవ్వాలంటూ హెచ్ వోడీలకు సర్క్యులర్ పంపింది. దీనిలో భాగంగానే ఇరిగేషన్ శాఖలోని తొమ్మిది శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.