సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను హైదరాబాద్‌లోని నివాసంలో కలిశారు.
విజయమ్మకు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల వినతి
సాక్షి, హైదరాబాద్: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను హైదరాబాద్‌లోని నివాసంలో కలిశారు. ఈనెల 27న ఢిల్లీలో నిర్వహించనున్న మహాధర్నాలో పార్టీ నేతలతో సహా పాల్గొనాలని ఉద్యోగులు విజయమ్మను కోరారు. ఇందుకు విజయమ్మ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర విభజన తో రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదముందని, సీవు ప్రజలకు తాగు నీరు కూడా అందక అల్లాడుతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విభజన పర్యవసానాలపై అవగాహన ఉన్న ఉద్యోగులు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడడం హర్షణీయమన్నారు. విభజన నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు, అసంఘటిత వర్గాలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, వారి తరఫున పోరాడతున్నామన్నారు.