
కిచ్చాడ సమీపంలో పామాయిల్ తోటలో ఏనుగులు
కురుపాం/జియ్యమ్మవలస: కొన్నాళ్లుగా జియ్యమ్మవలస, కొమరాడ మండలాలకు చెందిన ప్రజలను గజగజలాడిస్తున్న గజరాజుల గుంపు ఇప్పుడు కురుపాం మండలంలోని కిచ్చాడ గ్రామానికి చేరుకున్నాయి. ఈ మేరకు కిచ్చాడ గ్రామంలో ఉన్న పామాయిల్, అరటి తోటల్లోకి సోమవారం రాత్రి ప్రవేశించి తోటలకు పిచికారీ చేసే ఎరువులు ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు, రైతులు మంగళవారం తెల్లవారుజామున గుర్తించారు. దీంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖాధికారి మురళీకృష్ణ, సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి జియ్యమ్మవలస మండలం బట్లభద్ర గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలను నాశనం చేశాయి