మొగిలిఘాట్‌లో గజగజ! | Sakshi
Sakshi News home page

మొగిలిఘాట్‌లో గజగజ!

Published Wed, Dec 18 2019 11:02 AM

Elaphant Attacks in Mogili Ghat Chittoor - Sakshi

పలమనేరు: చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్‌ ప్రాంతంలో మంగళవారం ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది. దీంతో వాహనచోదకులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఎలిఫెంట్‌ ట్రాకర్ల సహాయంతో ఎనుగుల గుంపును దారి మళ్లించేందుకు యత్నించారు. అయితే అవి జగమర్ల దారిని దాటుకుని జాతీయ రహదారి పక్కనే సంచరిస్తున్నాయి. బంగారుపాళెం మండలంలో ఇటీవల విద్యుదాఘాతంతో ఓ మదపుటేనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏనుగులు ఆగ్రహంతో ఉన్నాయని, మనుషులపై దాడికి దిగే ప్రమాదముందని ఎఫ్‌ఆర్‌ఓ మదన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అందుకే అప్రమత్తంగా వాటి కదలికలను గమనిస్తున్నామన్నారు. వాటిని కాలువపల్లె బీట్‌ మీదుగా మోర్ధనా అటవీ ప్రాంతానికి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. మరోవైపు మొగిలిఘాట్‌లో వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement