
కీర్తన్ మలానీని ఊరేగిస్తున్న దృశ్యం
హిందూపురం అర్బన్: పట్టణంలోని వీడీ రోడ్డులో నివాసముంటున్న కైలాష్‌మలాని, కరుణదేవిల కుమారుడు కీర్తన్‌మలానీ(18) జైన సన్యాస దీక్ష స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. నిండా 18 ఏళ్లు కూడా లేని కీర్తన్ మలానీ ఐహిక సుఖాలు త్యజించి సన్యాసిగా మారాలని తీసుకున్న నిర్ణయంతో జైనమత పెద్దలు, కుటుంబీకులు, బంధువులు అతన్ని పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి మంగళవారం పల్లకీలో పురవీధుల గుండా ఊరేగిస్తూ నృత్యాలు చేశారు. ఈనెల 27న హుబ్లీలో ఆచార్య అజిత్‌శేఖర్ సురేజీ ఆధ్వర్యంలో కీర్తన్‌మలానీ సన్యాసదీక్షను స్వీకరించనున్నారు.