కొనసాగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్ | eamcet counselling successfully day 2 completed | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్

Aug 21 2013 3:24 AM | Updated on Sep 1 2017 9:56 PM

ఎంసెట్ కౌన్సెలింగ్ రెండో రోజు కూడా కొనసాగింది. జిల్లా కేంద్రంలోని రెండు హెల్ఫ్‌లైన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 15001 నుంచి 22500 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించగా 159 మంది సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకున్నారని సెంటర్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ పి.నర్సింహ తెలిపారు.

 నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్ రెండో రోజు కూడా కొనసాగింది. జిల్లా కేంద్రంలోని రెండు హెల్ఫ్‌లైన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 15001 నుంచి 22500 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించగా 159 మంది సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకున్నారని సెంటర్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ పి.నర్సింహ తెలిపారు. ఎన్జీ కాలేజీ హెల్ప్‌లైన్ సెంటర్‌లో 22501 నుంచి 30 వేల వరకు ర్యాంకు అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంగా 152 మంది పాల్గొన్నారని వెరిఫికేషన్ అధికారి కోటేశ్వర్‌రావు తెలిపారు.
 
 నేడు 45 వేల ర్యాంకు వరకు బుధవారం 30,001 నుంచి 37500 ర్యాంకు వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో, 37501 నుంచి 45 వేల ర్యాంకు వరకు ఎన్జీకాలేజీ హెల్ఫ్‌లైన్ సెంటర్‌కు హాజరుకావాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement