ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన | EAMCET certificate verification | Sakshi
Sakshi News home page

ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన

Aug 20 2013 2:33 AM | Updated on Jul 11 2019 6:33 PM

ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో 2013-2014 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

కేయూక్యాంపస్/పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో 2013-2014 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కాకతీయ యూనివర్సిటీలోని అడ్మిషన్ల డెరైక్టర్ కార్యాలయంలో, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్ కళాశాలల్లో అధికారులు సరిఫికెట్లను పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాలలో 1వ ర్యాంక్ నుంచి 5వేల ర్యాంక్ వరకు, ఆర్ట్స్ కాలేజీలో 5001 నుంచి 10వేల వరకు, కేయూలో 10001 నుంచి 15వేల వరకు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఆయా కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది.

ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్ జి.భద్రునాయక్ పర్యవేక్షణలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమేష్, అధ్యాపకులు వి.శ్రీనివాస్, చొక్కయ్య, డాక్టర్ రమేష్‌కుమార్, డాక్టర్ టి.మనోహర్, డాక్టర్ స్వరూపరాణి, డాక్టర్ జ్యోతి, యాకూబ్ సర్టిఫికెట్లను పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాలలో 47 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్క్రాచ్ కార్డు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.

వెబ్ కౌన్సెలింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ సెంటర్ ఇన్‌చార్జి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన కౌన్సెలింగ్‌లో వెంకటనారాయణ, కృష్ణ, శ్రీనివాస్, నరేందర్, అప్పరావు పాల్గొన్నారు. కాగా, ఈనెల 30వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కొనసాగనుంది. కౌన్సెలింగ్ సందర్భంగా ఆయా కేంద్రాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement