డాక్టర్‌ కేర్‌ హోమియోపతి ఆస్పత్రి ప్రారంభం | Doctor Care Homeopathy Hospital begins | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ కేర్‌ హోమియోపతి ఆస్పత్రి ప్రారంభం

Aug 15 2017 10:13 PM | Updated on Sep 17 2017 5:33 PM

డాక్టర్‌ కేర్‌ హోమియోపతి ఆస్పత్రి ప్రారంభం

డాక్టర్‌ కేర్‌ హోమియోపతి ఆస్పత్రి ప్రారంభం

డైమండ్‌ పార్కు సమీపంలోని శ్రీకన్య ఫారŠూచ్యన్‌ హోటల్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన డాక్టర్‌ కేర్‌ హోమియోపతి ఆస్పత్రిని సోమవారం రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి ప్రారంభించారు.

ద్వారకానగర్‌(విశాఖ దక్షిణ): డైమండ్‌ పార్కు సమీపంలోని శ్రీకన్య ఫారŠూచ్యన్‌ హోటల్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన డాక్టర్‌ కేర్‌ హోమియోపతి ఆస్పత్రిని సోమవారం రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇంగ్లిష్‌ మందులకు నయం కాని జబ్బులకు సైతం హోమియోపతి వైద్యం సంపూర్ణంగా పనిచేస్తుందన్నారు. ఎన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రులు వచ్చినా, హోమియో చికిత్స మాత్రం ప్రత్యేకమేనన్నారు. దశాబ్ద కాలం పాటు వైద్య రంగంలో అనుభవం కలిగిన డాక్టర్‌ ఎ.ఎం.రెడ్డి విశాఖలో ఆస్పత్రి ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.

 ఆస్పత్రి అధినేత ఎ.ఎం.రెడ్డి మాట్లాడుతూ విశాఖ ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిన టీఎస్సార్‌ చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విశాఖ కేంద్రంగా తమ బ్రాంచులను తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రారంభిస్తామన్నారు. సుబ్బిరామిరెడ్డి సేవా పీఠం స్ఫూర్తితో రోగులకు సలహాలు అందిస్తామన్నారు. అనంతరం లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మిలీనియం సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ అధినేత జి.శ్రీధర్‌రెడ్డి, విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు వరదారెడ్డి, పాలూరి శేషమాంబ, టి.ఎస్‌.ఎన్‌.మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement