కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదు | Do not recognized in TDP | Sakshi
Sakshi News home page

కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదు

May 25 2015 1:17 AM | Updated on Aug 10 2018 8:13 PM

టీడీపీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు రావడం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు గాదిరాజు సత్యనారాయణరాజు

భీమవరం : టీడీపీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు రావడం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) ఆవేదన వ్యక్తం చేశారు. రాయలంలో టీడీపీ మండల అధ్యక్షుడు నాగిడి ముత్యాలరావు అధ్యక్షతన టీడీపీ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే అంజిబాబు హాజరవగా గాదిరాజు బాబు మాట్లాడుతూ రాత్రింబవళ్లు పార్టీలో కష్టపడి పనిచేసిన గుర్తింపు రావడం లేదని, పార్టీ అధినేత చంద్రబాబు కష్టపడిన వారిని గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించాల్సిన భాద్యత పార్టీ అధిష్టానంపై ఉందన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ( అంజిబాబు) మాట్లాడుతూ కార్యకర్తల అండతో గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కార్యచరణ రూపొందిస్తామన్నారు. సీనియర్ నాయకుడు మెంటే పార్థసారధి, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు గ్రంధి శ్రీనాథ్, సర్పంచ్ రామచంద్రరావు, పేరిచర్ల శివరామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement