ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు గురువారం నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి.
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు గురువారం నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 62,384 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 23 పట్ణణాల్లో 68 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్షలను పర్యవేక్షించడానికి 44 మంది పరిశీలకులను నియమించారు. గురువారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి.