రోప్‌తో పాటు ఊడొచ్చిన బోటు పైభాగం..

Darmadi Satyam Team Royal Vasista Bote Operations Continue - Sakshi

కొలిక్కి వచ్చిన బోటు వెలికితీత ప్రక్రియ

సాక్షి, తూర్పుగోదావరి: దేవిపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి టూరిజం బోటు వెలికితీత పనులు కీలక దశకు చేరుకున్నాయి. బోటు వెలికితీత ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. సోమవారం రెండు రోప్‌ల ద్వారా బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేయగా.. బోటు పైభాగం రోప్‌తో పాటు ఊడొచ్చింది. ధర్మాడి సత్యం బృందం మరోసారి బోటు చుట్టూ రోప్‌ వేసి బోటు వెలికితీతకు ప్రయత్నాలు చేయనుంది. మైరన్‌ డైవర్లు గర్భంలోకి ఆక్సిజన్ తో దిగి బోటు వెనుక భాగానికి ఐరన్ రోప్ కట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈ ప్రయత్నం సఫలమైతే బోటును ఫొక్లైన్ తో బయటకు లాగొచ్చని భావిస్తున్నారు. ఆదివారం ధర్మాడి సత్యం బృందం ఐరన్‌ రోప్‌ల ద్వారా ఉచ్చు, లంగరు వేసి బోటు వెలికితీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో విశాఖ నుంచి మైరన్‌ డ్రైవర్‌లను రప్పించారు. 16 రోజులుగా బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం శ్రమిస్తోంది. వెలికితీత పనుల్లో పురోగతి కనిపించడంతో బోటును తప్పకుండా తీస్తామని ధర్మాడి బృందం, మైరన్‌ డ్రైవర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: బోటు చిక్కుతోంది.. పట్టు తప్పుతోంది)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top