‘టీడీపీ పాలనలో రాష్ట్రం అదోగతి పాలైంది’

Dadisetti Raja Slams On Yanamala Ramakrishnudu - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: అమరావతిలో భూముల రేట్లు పడిపోతాయని యనమల రామకృష్ణుడు రకరకాల ప్రేలాపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఆయన గురువారం జిల్లాలోని అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోపీడి చేసి ఇప్పుడు యనమల రామకృష్ణుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో యనమలతో పాటుగా ఆయన సోదరుడు, అల్లుడు భూములు కొన్నారని దాటిశెట్టి రాజా విమర్శించారు. ప్రజాధనాన్నీ.. యనమల, చంద్రబాబు కలిసి ఏలా దోచుకున్నారో త్వరలోనే బయట పెడతామన్నారు.

పరిశ్రమల పెట్టుబడుల కోసం వైజాగ్‌లో నిర్వహించిన కార్యక్రమాలకు టీడీపీ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు బస చేసిన ఒక్కో హోటల్‌కు రూ. 250 నుంచి రూ.300 కోట్లు చెల్లించారని దాడిశెట్టిరాజా మండిపడ్డారు. టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీడీపీ హయాంలో డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్కడ వచ్చిందో యనమల చెప్పాలని రాజా డిమాండ్‌ చేశారు. కేవలం ఫిషింగ్ సెక్టార్‌లో డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిందని.. ఆ సెక్టార్‌లో వచ్చిన గ్రోత్‌ను పట్టుకుని అన్ని సెక్టార్లలో వచ్చినట్లు మీడియాతో ప్రచారం చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లూలూ గ్రూప్ అనేది ఓ షాపింగ్ మాల్ లాంటిదని దాటిశెట్టిరాజా అన్నారు. గట్టిగా ఐదువందల మందికి కూడా ఈ కంపెనీలో ఉద్యోగాలు రావని ఆయన రాజా విమర్శించారు. అటువంటి షాపింగ్‌ మాల్‌కు రూ.10వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడతారని ప్రశ్నించారు. లూలూ గ్రూప్ ప్రపంచంలో పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అని.. యనమలతో పాటు చంద్రబాబు, లోకేష్ బిల్డప్‌ ఇస్తున్నారని దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైజాగ్‌లో పర్యటిస్తే వేలాది మంది వచ్చారని ఆయన తెలిపారు. చంద్రబాబులా తాము పేయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకోమని రాజా అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top