డబ్బులు చూసి షాక్‌ అయిన కస్టమర్‌..!

Customer Shocks For Withdrawal Damaged Notes From ATM In Mylavaram - Sakshi

సాక్షి, మైలవరం/విజయవాడ : ఏటీఎం నుంచి నగదు డ్రా చేసిన ఓ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. అతను డ్రా చేసిన సొమ్ములో చిరిగిపోయిన రెండువేల నోట్లు రావడమే దీనికి కారణం. ఈ ఘటన మైలవరంలో వెలుగుచూసింది. నారాయణ థియేటర్ కాంప్లెక్స్‌లో గల స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో  మద్దాలి గణేష్ అనే స్థానికుడు రూ.30 వేలు డ్రా చేయగా.. అందులో10 రెండువేల రూపాయల నోట్లు చినిగిపోయినవి రావడంతో అతను నిర్ఘాంతపోయాడు. ముప్పయి వేలలో ఇరవై వేలు చిరిగిపోయినవి వచ్చాయని వాపోయాడు. ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్యాంకులు సైతం ఇలా వినియోగదారులను మోసం చేస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలా చాలాసార్లు చిరిగిన నోట్లు పెట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top