ప్రకాశం జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో మావోయిస్టుల ఉనికి లేకపోయినా కూంబింగ్ కొనసాగుతుందని మార్కాపురం డీఎస్పీ ఆర్.శ్రీహరిబాబు తెలిపారు.
'నల్లమలలో కూంబింగ్ కొనసాగుతుంది'
Dec 3 2015 1:11 PM | Updated on Sep 3 2017 1:26 PM
ఎర్రగొండపాళెం: ప్రకాశం జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో మావోయిస్టుల ఉనికి లేకపోయినా కూంబింగ్ కొనసాగుతుందని మార్కాపురం డీఎస్పీ ఆర్.శ్రీహరిబాబు తెలిపారు. ఎర్రగొండపాళెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను రక్షించేందుకే ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించేలా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నామని, గురువారం నాటికి వెయ్యి కేసులు నమోదు చేశామని వివరించారు. ఎర్రగొండపాళెంలో నిఘా కెమెరాలను అమర్చామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి త్వరలో ఈ చలానాలు జారీ చేస్తామన్నారు.
Advertisement
Advertisement