ప్రభుత్వం పంపిణీ చేసిన భూ లబ్ధిదారులకు పంట రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి అన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వం పంపిణీ చేసిన భూ లబ్ధిదారులకు పంట రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఐ.వై.ఆర్. కృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో శుక్రవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూమంత్రి మాట్లాడుతూ ఇంతవరకు పలు విడతల్లో పేదలకు 77 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశామ న్నారు. అరుుతే, ఇంత వరకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు సాగుచేస్తున్న లబ్ధిదారులకు రుణాలు అందించలేదన్నారు. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ విషయూన్ని చర్చిస్తామని, అందరి రైతులకు రుణాలు అందేలా జిల్లా స్థారుు అధికారులు చూడాలన్నారు. ఐ.వై.ఆర్ కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాల్లో సమీకృత మార్కెట్ యార్డులను నిర్మిస్తామన్నారు. పంట నిల్వకు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని తెలిపారు. దీనికి అవసరమైన భూమిని గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్‌ను కోరారు.
జిల్లాల్లో ప్రభుత్వ భూముల పరిస్థితి, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సమీక్షించారు. సమీకృత మార్కెట్ యార్డులను జిల్లాలోని ఉద్యానవన నర్సరీ కేంద్రాల్లో నిర్మించాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ సూచించారు. పలాస ప్రాంతంలో జీడి పరిశ్రమలు అధికంగా ఉన్నాయని, ఇక్కడ కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి పి. రజనీకాంతరావు, ఆర్డీవో గణేష్‌కుమార్, ఎన్.తేజ్‌భరత్, ఉపకలెక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.