కుంగిన ప్యాసింజర్ బోగీ | crass the passenger coach | Sakshi
Sakshi News home page

కుంగిన ప్యాసింజర్ బోగీ

Jul 26 2015 1:10 AM | Updated on Sep 29 2018 5:26 PM

ఉంగుటూరు : పుష్కరాల సందర్భంగా రద్దీగా వెళుతున్న ఓ ప్యాసింజర్ రైలులో బోగీ అకస్మాత్తుగా విరిగిపోరుు కుంగిపోవడంతో ప్రయూణికులు భీతిల్లారు.

ఉంగుటూరు : పుష్కరాల సందర్భంగా రద్దీగా వెళుతున్న ఓ ప్యాసింజర్ రైలులో బోగీ అకస్మాత్తుగా విరిగిపోరుు కుంగిపోవడంతో ప్రయూణికులు భీతిల్లారు. పెద్ద శబ్ధం రావడంతో హాహాకారాలు చేస్తూ రైలు నుంచి దిగిపోయూరు. డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమా దం తప్పింది. ఉంగుటూరు రైల్వేస్టేషన్ వద్ద శనివారం వేకువజామున జరిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారుు.. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళుతున్న పాసిం జర్ రైలు ఉదయం 5.15 గంటల సమయంలో ఉంగుటూరు రైల్వేస్టేషన్‌లో ఆగింది. ప్రయాణికులను ఎక్కించుకుని విజయవాడ వైపు బయలుదేరిన రెండు నిమిషాల అనంతరం ఓ బోగీ మధ్యభాగంలో విరిగిపోయింది.
 
 వాక్యూమ్ పైప్ తెగిపోయి రైలు పట్టాల కిందకు దిగబడిపోయింది. ఈ సమయంలో పెద్ద శబ్ధం రావడంతో ప్రయాణికులంతా భీతావహులయ్యారు. విషయాన్ని గ్రహించిన రైలు డ్రైవర్లు కల్యాణ్, వీరభద్రరావు వెంటనే రైలును నిలిపివేశారు. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగిపోయారు. అదే సమయంలో రాజమండ్రి వైపు ఓ ఎక్స్‌ప్రెస్ రైలు రావటాన్ని గ్రహించిన పాసింజర్ రైలు డ్రైవర్లు దానిని నిలుపుదల చేయించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
 
 రైళ్ల రాకపోకలు ఆలస్యం
 రైలు బోగీ విరిగిపోవటంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలను రెండు గంటలకు పైగా ఎక్కడికక్కడ నిలిపివేశారు. రాజమండ్రి నుంచి హూటాహుటిన ప్రత్యేక రైలులో సిబ్బంది తరలివచ్చారు. విరిగిపోయిన బోగీని తొలగించి మిగిలిన బోగీలను చేబ్రోలు రైల్వే స్టేషన్‌కు తరలించారు. పాసింజర్ రైలులోని ప్రయాణికులను సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో, రాయగడ పాసింజర్‌లో తరలించారు. చాలామంది ప్రయాణిలు రోడ్డుపైకి వేర్వేరు వాహనాల్లో గమ్య స్థానాలకు వెళ్లారు.
 
 రోడ్లపైనే నిద్ర
 ప్రయూణికుల్లో పలువురు రైల్వేస్టేషన్ ఆవరణలో, రోడ్డుపై, జాతీయ రహదారి చెంతన నిద్రించారు. పుష్కర రద్దీతో ఈ రైలు ఎక్కేందుకు ఇబ్బంది పడ్డామని ప్రయూణికులు సత్యనారాయణ, వరలక్ష్మి వాపోయారు. రైల్వే శాఖ ఏర్పాట్లు సరిగా లేవన్నారు.
 
 బ్రేక్ పైపు ఒత్తిడే కారణం
 ఏడీఆర్‌ఎం ఎన్‌ఎస్‌ఆర్ ప్రసాద్
 ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నామని విజయవాడ డివిజన్ ఏడీఆర్‌ఎం ఎన్‌ఎస్‌ఆర్ ప్రసాద్ చెప్పారు. ఆయన ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బ్రేక్ పైపు ఒత్తిడి అధికమవ్వడం వల్ల బోగీ విరిగి కుంగిపోరుుందన్నారు. కొన్నిసార్లు లోడు ఎక్కువగా ఉన్నా బోగీలు విరిగిపోయే ప్రమాదం ఉం దన్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీర్ వరప్రసాద్, మెకానిక ల్ ఇంజినీర్ ప్రదీప్‌కుమార్, స్టేఫీ అధికారి ప్రసాద్ నేతృత్వంలో సిబ్బంది మరమ్మతులు జరిపి రెండు గంటలలో రైలును పునరుద్ధరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement