
భూచట్టంపై అనంతపురం జిల్లాలో సీపీఐ నిరసన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
అనంతపురం : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాలోని రాప్తాడులో పార్టీ కార్యకర్తలు సీపీఐ జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య అనంతపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.