చంద్రబాబునాయుడు బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు.
విజయవాడ: చంద్రబాబునాయుడు బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో సురవరం మాట్లాడుతూ.. తెలంగాణలో నా వల్లే రాష్ట్ర విభజన జరిగిందన్న చంద్రబాబు జూన్ 2న ఏపీలో బ్లాక్‌డే నిర్వహించడం అవకాశవాదం కాదా? అని ప్రశ్నించారు.
మూడేళ్లలో రాష్ట్ర ప్రయోజనాలను బాబు ఏ మేరకు సాధించారని అడిగారు. హోదా అడుగుతున్నవారిని ప్రగతి నిరోధకులుగా అభివర్ణించడం దారుణమని సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు.