ఏపీలో మరో 793 కరోనా కేసులు | Coronavirus : 793 New Positive Cases Registered In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో 793 కరోనా కేసులు

Jun 29 2020 2:01 PM | Updated on Jun 29 2020 2:04 PM

Coronavirus : 793 New Positive Cases Registered In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మరో 706 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 81మందికి, విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 30,216 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 793 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,891కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 302మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 11 మంది  మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 180కి చేరింది. ఈ రోజు మృతి చెందిన 11 మందిలో కర్నూలు 5, కృష్ణా 2, నెల్లూరులో 2, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7479 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement