విద్యుదాఘాతంతో సబ్‌స్టేషన్ కాంట్రాక్ట్ హెల్పర్ మృతిచెందాడు. ఈ సంఘటన బొమ్మలరామారంలో ఆదివారం చోటుచేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది.
విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ హెల్పర్ మృతి
Oct 1 2013 1:47 AM | Updated on Sep 1 2017 11:12 PM
	బొమ్మలరామారం, న్యూస్‌లైన్ :విద్యుదాఘాతంతో సబ్‌స్టేషన్ కాంట్రాక్ట్ హెల్పర్ మృతిచెందాడు. ఈ సంఘటన బొమ్మలరామారంలో ఆదివారం చోటుచేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జలాల్‌పురం గ్రామానికి చెందిన మోడిగోపు లక్ష్మీనారాయణ (45) 15 సంవత్సరాలుగా బొమ్మలరామారం సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్ట్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన లక్ష్మీనారాయణ అర్ధరాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు అతని సెల్‌ఫోన్‌కు కాల్ చేస్తే పలుమార్లు రింగ్ అయినా ఎత్తలేదు. 
	 
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	 దీంతో ఆందోళనకు గురై రాత్రి అంతా వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం కూడా వెతికారు.  ఈ క్రమంలో మండలంలోని బండకాడిపల్లి శివారులో గల వ్యవసాయ భూమి వద్ద లక్ష్మీనారాయణ బైక్ కనిపించింది. సమీపంలో గల విద్యుత్ స్తంభం వద్ద అతని మృతదేహం పడి ఉంది. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే స్తంభంపై జంపర్ తెగిపోవడంతో దానిని సరిచేసే క్రమంలో విద్యుత్‌షాక్ తగిలి లక్ష్మీనారాయణ మృతిచెందినట్టు తెలుస్తోంది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.  కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. 
	 బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
	 లక్ష్మీనారాయణ కుటుంబానికి పైళ్ల శేఖర్‌రెడ్డి రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు. మృతుడి పిల్లల ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులను సైతం అందిస్తానని హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
