కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం | congress leader trying to do murder attempt | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం

Sep 6 2013 5:10 AM | Updated on Oct 8 2018 5:04 PM

కాంగ్రెస్ బీసీసెల్ జిల్లా కార్యదర్శి పెద్ద విజయ్‌కుమార్‌పై గుర్తు తెలి యని వ్యక్తులు గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హత్యాయత్నానికి పాల్పడ్డారు. పదునైన ఆయుధాలతో దాడిచేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.

మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: కాంగ్రెస్ బీసీసెల్ జిల్లా కార్యదర్శి పెద్ద విజయ్‌కుమార్‌పై గుర్తు తెలి యని వ్యక్తులు గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హత్యాయత్నానికి పాల్పడ్డారు. పదునైన ఆయుధాలతో దాడిచేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. జిల్లా కేంద్రంలోని బోయపల్లిగేట్ సమీపంలోని లారీ అసోసియేషన్ కార్యాలయానికి పెద్ద విజయ్‌కుమార్ వ్యక్తిగత పనులపై వెళ్లాడు. అసోసియేషన్‌కు సంబంధించిన ఓ వ్యక్తితో ఓ విషయంపై గొడవ జరిగింది. దీంతో ఇద్దరి మద్య మాటామాట పెరి గి వాగ్వావాదం చోటు చేసుకుంది.
 
 దీంతో ఆగ్రహానికి విజయ్‌కుమార్ ఆ వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితుడి కొడుకు పదునైన ఆయుధంతో విజయ్‌కుమార్‌పై దాడిచేయగా..తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. సమీపంలోనే ఉన్న విజయ్‌కుమార్ అనుచరులు అతడిని వెంటనే పట్టణంలోని నవోదయ ఆస్పత్రికి తరలించారు. మైరుగైన వైద్య చికిత్స కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. విజయ్‌కుమార్‌పై జరిగిన దాడి జరిగిన విషయం పట్టణంలో దావనంలా వ్యాపించడంతో కాంగ్రెస్ నేతలు, అతని అనుచరులు ఆస్పత్రి వద్దకు చే రుకున్నారు. లోపలికి అనుమతించకపోవడంతో ఆస్పత్రి సిబ్బందితో గొడవపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. సీఐ పాండురంగారెడ్డి, వన్‌టౌన్ ఎస్‌ఐ రమేష్‌లు బాధితుడిని అడిగి ఘటనకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. హత్యాయత్యానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement