కాంగ్రెస్ది చారిత్రక తప్పిదం: వెంకయ్య | congress, aam aadmi party alliance historical mistake, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ది చారిత్రక తప్పిదం: వెంకయ్య

Jan 13 2014 1:49 PM | Updated on Oct 20 2018 6:04 PM

కాంగ్రెస్ది చారిత్రక తప్పిదం: వెంకయ్య - Sakshi

కాంగ్రెస్ది చారిత్రక తప్పిదం: వెంకయ్య

ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదం చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు అన్నారు.

నెల్లూరు: ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదం చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఆమ్ ఆద్మీ పార్టీకి లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

తమ పార్టీలో చేరేందుకు భారీ సంఖ్యలో నాయకులు,  కార్యకర్తలు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. మోడీ ప్రధాని కావాలని దేశమంతా కోరుకుంటుందని అంతకుముందు వెంకయ్య అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే సత్తా ఉన్న నరేంద్ర మోడీ ఉందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement