'స్వామిగౌడ్ కు మంత్రి పదవి ఇవ్వవద్దు' | Complaint against MLC Swamy goud on Ministership | Sakshi
Sakshi News home page

'స్వామిగౌడ్ కు మంత్రి పదవి ఇవ్వవద్దు'

May 23 2014 6:07 PM | Updated on Mar 28 2018 10:56 AM

'స్వామిగౌడ్ కు మంత్రి పదవి ఇవ్వవద్దు' - Sakshi

'స్వామిగౌడ్ కు మంత్రి పదవి ఇవ్వవద్దు'

మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ స్వామి గౌడ్ కు చుక్కెదురైంది.

హైదరాబాద్: మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ స్వామి గౌడ్ కు చుక్కెదురైంది. స్వామిగౌడ్ కు మంత్రిపదవి ఇవ్వవద్దని తెలంగాణ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు టీఆర్ఎస్ అధినేత మంత్రి పదవి ఇవ్వనున్నట్టు మీడియాలో వచ్చిన ప్రచారంపై  తెలంగాణ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్ మండిపడ్డారు. 
 
ఉద్యోగ సంఘాల నేతగా ఉన్నకాలంలలో స్వామిగౌడ్‌ అనేక అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయనపై భూవివాదాలు, కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్ నేతలు ఆరోపించారు.  అవినీతి అరోపణలు ఉన్న నేతలను మంత్రులుగా నియమించడం తగదని టీఆర్ఎస్ పార్టీకి, అధినేత కేసీఆర్ కు సూచించారు.  టీఎన్జీవో హౌసింగ్‌ సొసైటీలో అక్రమాల చేసినట్టు స్వామిగౌడ్ పై ఆరోపణలున్నాయని తెలంగాణ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్ మీడియాకు వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement