సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు | CM to arrange a tour of the massive | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు

Jun 15 2014 4:15 AM | Updated on Aug 29 2018 3:33 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమ, మంగళ వారాల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమ, మంగళ వారాల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఆయన తొలిసారిగా సొంత నియోజకవర్గానికి వస్తున్నారు. సోవువారం ఉదయుం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకుని అక్కడ నుంచి  హెలి క్యాప్టర్‌లో రామకుప్పానికి వస్తారు.  

బస్టాండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కార్యకర్తల సవూవేశంలో ప్రసంగి స్తారు. అక్కడ నుంచి  శాంతిపురానికి చేరుకుని బహిరంగ సభ, కార్యకర్తల సవూవేశం నిర్వహిస్తారు. కడా కార్యాలయూన్ని సందర్శిస్తారు. గణేష్‌పురం వద్ద ఉన్న సీఆర్సీ భవనంలో నియోజకవర్గ పార్టీ నాయకులతో సవూవేశమవుతారు.

అనంతరం గుడుపల్లి వుండల కేంద్రంలో బహిరంగ సభ, కార్యకర్తల సవూవేశంలో పాల్గొంటారు. తర్వాత కుప్పం బస్టాండులో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా అధికార్లతో సమీక్ష సవూవేశం నిర్వహించి రాత్రికి అక్కడే బస చేస్తారు. వుంగళవారం ఉదయుం 9 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయూణమవుతారు.

శనివారం ఉదయుం జిల్లా స్థాయి అధికారులు కుప్పం పట్టణానికి వచ్చారు.  నియోజకస్థారుు అధికార్లతో సమీక్షలు నిర్వహించారు. వుదనపల్లె సబ్ కలెక్టర్ భరత్ గుప్తా అధికార్లతో సమీక్షలు జరిపారు. చిత్తూరు ఎస్పీ  రావుకృష్ట, పలవునేరు డీఎస్పీ హరినాథ్ రెడ్డి సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement