సీఎం ఇంటి మురుగు పొలాల్లోకి.. | Sakshi
Sakshi News home page

సీఎం ఇంటి మురుగు పొలాల్లోకి..

Published Thu, Jun 9 2016 12:46 AM

సీఎం ఇంటి మురుగు పొలాల్లోకి.. - Sakshi

ట్యాంకర్ల ద్వారా మురుగు తరలింపు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

 
ఉండవల్లి (తాడేపల్లి రూరల్): ఒక వైపు స్వచ్ఛభారత్ అంటూ ఊదరగొడుతూనే రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లి గ్రామాన్ని మాత్రం ముఖ్యమంత్రి మురికి కూపంలోకి నెడుతున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసం సమీపంలో పంట పొలాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. సీఎం తన ఇంట్లో వాడిన నీటిని ట్యాంకర్లలో లోడు చేసి నేరుగా పచ్చని పంట పొలాల్లోకి వదులుతున్నారు.


మురుగు నీరు కారణంగా ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోందని, పొలం పనులు చేయలేకపోతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మురుగు నీటితో పంటలు వేసుకోవడానికి ఇబ్బంది మారిందని చెబుతున్నారు. ప్రతి ఇంటిలో చెత్తా చెదారం, మురుగునీటిని అందుబాటులో ఉన్న సైడు డ్రెయిన్‌లోకి మళ్లించుకోవాలి. కానీ ముఖ్యమంత్రి నివాస గృహానికి కరకట్ట పక్కన ఎటువంటి సైడు డ్రెయిన్ లేకపోవడంతో మురుగు నీటిని ట్యాంకర్ల ద్వారా కరకట్టపై నుంచి పొలాల్లోకి వదులుతున్నారు. దీనిని స్వయంగా సీఆర్‌డీఏ అధికారులు పర్యవేక్షిస్తుండడం గమనార్హం.

Advertisement
Advertisement