సినిమా ఎలా ఉంది మావ.. | cinema choopistha mava Chitra unit Noise | Sakshi
Sakshi News home page

సినిమా ఎలా ఉంది మావ..

Aug 31 2015 12:35 AM | Updated on Sep 3 2017 8:25 AM

సినిమా చూపించాను మావ... ఎలా ఉంది... మంచి చిత్రాలను తీసి మీ ఆదరణ పొందుతాను.’

 పట్టణంలో ‘సినిమా చూపిస్తా మావ’
 చిత్ర యూనిట్ సందడి

 విజయనగరం టౌన్ : ‘సినిమా చూపించాను మావ... ఎలా ఉంది... మంచి చిత్రాలను తీసి మీ ఆదరణ పొందుతాను.’ అంటూ  యువ హీరో రాజ్ తరుణ్ స్థానిక ఆదిత్య థియేటర్‌లో ఆదివారం రాత్రి సందడి చేశారు. ‘సినియా చూపిస్తా మావ’ చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం వచ్చామన్నారు.  కథలో ప్రతి అంశాన్ని కొత్తదనంతో చూపించేందుకు దర్శకులు ప్రయత్నం చేశారన్నారు.  సినిమాను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.   అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  సుకుమార్ నిర్మాతగా కుమారి -21లోనూ,  శ్రీశైలేంద్ర మూవీస్ బ్యానర్‌పై మరో చిత్రంలోనూ నటించనున్నామన్నారు. డెరైక్టర్‌ను అవుదామని సినీ ఫీల్డ్‌కు వచ్చానని, షార్ట్ ఫిల్మ్ తీస్తే హీరోగా అవకాశం వచ్చిందన్నారు.  మహేష్‌బాబు, బన్నీలంటే చాలా ఇష్టమని తెలిపారు. సహాయ నటుడు  సంతోష్ మాట్లాడుతూ  తాను మెంటాడకు చెందిన వాడినని, జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తానన్నారు.  కార్యక్రమంలో  డైలాగ్ రైటర్ ప్రసన్న, రాజ్‌భాయ్, థియేటర్ మేనేజర్ బి.హరివర్మ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement