హిందూపురం మార్కెట్‌యార్డు వద్ద రోడ్డుపై మిర్చి రైతులు ఆందోళనకు దిగారు.
హిందూపురం మార్కెట్‌యార్డు వద్ద రోడ్డుపై మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి ధర అమాంతం తగ్గిపోవడంతో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పోయిన వారం మిర్చి పది కేజీల ధర రూ.1800 ఉండగా..మంగళవారానికి రూ. 1300కు పడిపోయిందని రైతులు వాపోయారు. అధికారులు తమ న్యాయం చేయాలని నినాదించారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.