‘‘చిన్ననాటి నుంచీఎంబీబీఎస్ చదవాలనే లక్ష్యం, ఆ మేరకు ఆరో తరగతి నుంచే క్రమబద్ధమైన ప్రిపరేషన్ సాగించడమే నా విజయానికి కారణం.
మెడిసిన్ విభాగంలో మొదటి ర్యాంకర్ ప్రియాంక మనోగతం
‘‘చిన్ననాటి నుంచీఎంబీబీఎస్ చదవాలనే లక్ష్యం, ఆ మేరకు ఆరో తరగతి నుంచే క్రమబద్ధమైన ప్రిపరేషన్ సాగించడమే నా విజయానికి కారణం. లెక్చరర్లు అందించిన గెడైన్స్, మాక్ టెస్ట్‌లు కూడా విజయానికి దోహదపడ్డాయి. ఉస్మానియాలో ఎంబీబీఎస్‌లో చేరి, పీజీలో కార్డియాలజీ స్పెషలైజేషన్ చేయాలనేది ప్రస్తుత లక్ష్యం. త్వరలో ఎయిమ్స్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్, జిప్‌మర్‌లకు హాజరవుతున్నా.. వాటిలోనూ మంచి ర్యాంకు వస్తుంది..’’ అని మెడికల్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన ప్రకాశం జిల్లా విద్యార్థిని ఉప్పలపాటి ప్రియాంక తెలిపింది. ఆమె 100 శాతం మార్కులు (160) సాధించి 84,678 మంది అభ్యర్థుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఏపీ ఎంసెట్‌లో 17వ ర్యాంకు సాధించింది.
‘సాక్షి’ మాక్ ఎంసెట్‌లో ఫస్ట్ ర్యాంకు
రెండు రాష్ట్రాల ఎంసెట్ అభ్యర్థులను సన్నద్ధం చేసేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఏప్రిల్ 26న నిర్వహించిన మాక్ ఎంసెట్‌లో కూడా తొలి ర్యాంకు సొంతం చేసుకున్న ప్రియాంక.. ఆ పరీక్ష ఎంతో ఉపకరించిందని, చిన్నపాటి లోపాలు సరిదిద్దుకునే అవకాశం కల్పించిందని పేర్కొంది.