డీఎస్పీ సుప్రజ సహా తొమ్మిది మందికి ఛార్జి మెమోలు | charge memos issued to dsp supraja and others | Sakshi
Sakshi News home page

డీఎస్పీ సుప్రజ సహా తొమ్మిది మందికి ఛార్జి మెమోలు

Dec 4 2013 8:08 AM | Updated on Jun 1 2018 8:31 PM

డీఎస్పీ సుప్రజ సహా తొమ్మిది మందికి ఛార్జి మెమోలు - Sakshi

డీఎస్పీ సుప్రజ సహా తొమ్మిది మందికి ఛార్జి మెమోలు

హత్యకేసులో నిందితులకు బహిరంగంగా కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులపై డీఐజీ బాలకృష్ణ సీరియస్ అయ్యారు. డీఎస్పీ సుప్రజ, సీఐ గోరంట్ల మాధవ్ సహా ఏడుగురికి ఛార్జి మెమోలు జారీ చేసినట్లు తెలిపారు.

హత్యకేసులో నిందితులకు బహిరంగంగా కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులపై డీఐజీ బాలకృష్ణ సీరియస్ అయ్యారు. నిందితులను నడిరోడ్డుపై ఊరేగించి, అక్కడే లాఠీలతో చితక్కొట్టడాన్ని తీవ్రంగా పరిగణించారు. కర్తవ్యం సినిమా రేంజిలో డీఎస్పీ సుప్రజ నేతృత్వంలో పలువురు పోలీసులు హత్యకేసు నిందితులను లాఠీలతో సత్కరించిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.

ఈ విషయంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని డీఐజీ బాలకృష్ణ హెచ్చరించారు. అత్యుత్సాహంతో వ్యవహరించిన డీఎస్పీ సుప్రజ, సీఐ గోరంట్ల మాధవ్ సహా ఏడుగురికి ఛార్జి మెమోలు జారీ చేసినట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement