మంత్రి రావెలకు ఛాన్స్ ఇవ్వని చంద్రబాబు | chandrababu niadu denies chance to ministers | Sakshi
Sakshi News home page

మంత్రి రావెలకు ఛాన్స్ ఇవ్వని చంద్రబాబు

Sep 20 2014 1:03 PM | Updated on Jul 28 2018 6:33 PM

మంత్రి రావెలకు ఛాన్స్ ఇవ్వని చంద్రబాబు - Sakshi

మంత్రి రావెలకు ఛాన్స్ ఇవ్వని చంద్రబాబు

మంత్రుల పనితీరుపై ఇటీవల గ్రేడ్లు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి వారిపై తన ప్రతాపాన్ని చూపారు.

హైదరాబాద్ : మంత్రుల పనితీరుపై ఇటీవల గ్రేడ్లు ఇచ్చిన  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి వారిపై తన ప్రతాపాన్ని చూపారు.  అది కూడా స్వయం సహాయక సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ సాక్షిగా మంత్రులకు చురకలు అంటించారు. చంద్రబాబు శనివారం  జన్మభూమి కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు పలు సందేహాలు లేవనెత్తారు. ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తన సందేహాన్ని అడిగేందుకు ప్రయత్నించగా ఇది అసెంబ్లీయో, మంత్రివర్గ సమావేశమో కాదంటూ అడ్డుకున్నారు.

అలాగే తనకు మాట్లాడేందుకు  అవకాశం ఇవ్వాలని గుంటూరు జిల్లా నుంచి మంత్రి రావెల కిషోర్ బాబు కోరగా... ýనేను క్లారిటీ ఇవ్వాల్సింది నీకు కాదు... క్రింతిస్థాయి అధికారులకు అంటూ రావెలతో సీఎం మాట్లాడేందుకు నిరాకరించారు. చివరిసారిగా అవకాశం ఇవ్వాలని రావెల మరోసారి కోరినప్పటికీ చంద్రబాబు కుదరదని తేల్చి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement