'చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి' | Chandrababu Naidu against to muslims, says MLA musthfa | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి'

Jun 14 2015 4:18 PM | Updated on Sep 3 2017 3:45 AM

'చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి'

'చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి'

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంగా మంత్రివర్గంలో ముస్లింలకు చోటు ఇవ్వలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా మండిపడ్డారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడుస్తున్నా మంత్రివర్గంలో ముస్లింలకు చోటు ఇవ్వలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా మండిపడ్డారు. చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి' అంటూ ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లాలోని తెనాలి వైఎస్ఆర్ సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఆదివారం మహబూబ్ బాషా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ముస్తఫా, అన్నాబత్తుని శివకుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బండారం బయటపడుతుందని, 80 శాతం మంది ప్రజలు చంద్రబాబును దోషిగా పేర్కొంటున్నారని మర్రి రాజశేఖర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement