breaking news
MLA musthafa
-
హజ్ యాత్ర పవిత్రమైనది..
ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా గుంటూరు (పట్నంబజారు): ప్రతి ముస్లిం తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని, మక్కాను దర్శించడం వల్ల పవిత్రకరంగా ఉంటుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా అన్నారు. హైదరాబాద్‌లోని హజ్ కమిటీ భవన్ వద్ద శనివారం హజ్ యాత్రికులు వెళుతున్న బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. హజ్ కమిటీ భవనం నుంచి విమానాశ్రయానికి బస్సులో వెళ్ళి అక్కడి నుంచి విమానంలో మక్కా చేరుకుంటారని తెలిపారు. గుంటూరు నగరం నుంచి పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు శనివారం పయనమవడంతో వారికి శుభాకాంక్షలు తెలిపి బస్సును ప్రారంభించారు. హజ్ యాత్ర 40 రోజులు ఉంటుందని, యాత్రలో ఎన్నో మసీదులు దర్శించుకుని ఆధ్యాత్మికతతో నడుచుకుంటూ భగవంతుని సేవలో నిమగ్నమవ్వాలన్నారు. పవిత్రకరమైన హజ్‌యాత్ర వల్ల జీవితంలో ఆధ్యాత్మికత పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు నగరానికి చెందిన ముస్లిం పెద్దలు అబిద్‌బాషా, కరీముల్లా ,మగ్బుల్బాబు తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడుస్తున్నా మంత్రివర్గంలో ముస్లింలకు చోటు ఇవ్వలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా మండిపడ్డారు. చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి' అంటూ ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లాలోని తెనాలి వైఎస్ఆర్ సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఆదివారం మహబూబ్ బాషా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ముస్తఫా, అన్నాబత్తుని శివకుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బండారం బయటపడుతుందని, 80 శాతం మంది ప్రజలు చంద్రబాబును దోషిగా పేర్కొంటున్నారని మర్రి రాజశేఖర్ తెలిపారు.