ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా?: చంద్రబాబు | Chandrababu Comments with TDP Leaders | Sakshi
Sakshi News home page

ఈ పరిస్థితి ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తున్నా..

Aug 29 2019 5:16 AM | Updated on Aug 29 2019 10:40 AM

Chandrababu Comments with TDP Leaders - Sakshi

సాక్షి, అమరావతి: తాను ఎంత కష్టపడినా, అన్నీ బాగా చేసినా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా? అని ఆలోచిస్తున్నానని ప్రతిపక్ష నేత చంద్రబాబు వాపోయారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో తనను కలిసిన తెలంగాణ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కొనసాగడం చారిత్రక అవసరమైందన్నారు. తాను ఆశాజీవినని, అధైర్యపడకుండా ముందుకు సాగుతానని చెప్పారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తానన్నారు. తాను చేసిన అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారిందన్నారు.

ఒక్క అవకాశం అని అందలమెక్కి మూడు నెలల్లోనే ఏపీని అంధకారంలోకి తీసుకెళ్లారని విమర్శించారు. ఆ తర్వాత రాష్ట్ర నాయకులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అమరావతిని తరలిస్తారనే ప్రచారంతో ఏపీకి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారన్నారు. లక్షలాది మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని తొలగించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement