చంద్రబాబును కలిసిన అజీమ్ ప్రేమ్‌జీ
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ వినతికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావులు సానుకూలంగా స్పందించారు.
	హైదరాబాద్: విప్రో చైర్మన్ అజీమ్ హషిమ్ ప్రేమ్‌జీ వినతికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావులు సానుకూలంగా స్పందించారు. ఈ రోజు ఆయన ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులతో వేరువేరుగా సమావేశమయ్యారు.  తెలంగాణలో ఐటీ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని  ప్రేమ్‌జీ  చెప్పారు. ఐటి పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక సదుపాయాలతోపాటు స్థలాలు కేటాయించాలని  ప్రేమ్‌జీ కెసిఆర్కు  విజ్ఞప్తి చేశారు. అందుకు కెసిఆర్ సుముఖత వ్యక్తం చేశారు.
	
	 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా  ప్రేమ్‌జీ అదే రకమైన విజ్ఞప్తి చేశారు. అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు  సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పారు.
	
	ఇదిలా ఉండగా, మెదక్ జిల్లా  మాసాయిపేట స్కూల్ బస్ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల  కుటుంబాలకు ప్రభుత్వం తరపున మంత్రి హరీష్‌రావు ఆర్థిక సాయం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
