చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన యువతి అరెస్టు | chain Snacing to the arrest of a young woman | Sakshi
Sakshi News home page

చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన యువతి అరెస్టు

Dec 3 2015 12:50 AM | Updated on Sep 3 2017 1:23 PM

చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న యువతిని కొత్తపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

గుంటూరు ఈస్ట్: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న యువతిని కొత్తపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నాలుగు సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 1వ తేదీ వెంకటేశ్వరవిజ్ఞాన మందిరం రోడ్డులో పెదకూరపాడు మండలం అబ్బురాజుపాలెం గ్రామానికి చెందిన అమరనేని అనసూయమ్మ సిటీ బస్సు దిగుతుండగా ఓ యువతి ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారం  నానుతాడు తెంచుకుని పరారైంది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం తమిళనాడుకు చెందిన ప్రభుమారి అనే యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె నుండి నానుతాడు స్వాధీనం చేసుకున్నారు. కేసు పురోగతిలో పాల్గొన్న హెడ్‌కానిస్టేబుల్ ఎం డీఎ ఖాన్, సిబ్బంది తనూజా, లక్ష్మి తిరుపతమ్మలను ఎస్సై అభినందించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement