రెడ్‌ అలెర్ట్‌

Central Government Announced Red Alert in Chittoor - Sakshi

అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ

కరోనా కేసులు పెరుగుతుండడమే కారణం

ప్రజలు సహకరిస్తే నిలువరించడం సాధ్యమే

చిత్తూరును రెడ్‌ జిల్లాగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు త్వరగా,ఎక్కువగా విస్తరిస్తున్న 96 జిల్లాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఇందులో మన రాష్ట్రం నుంచి     ఏడు జిల్లాలు ఉండగా చిత్తూరు కూడా జాబితాలోఉండటం జిల్లా వాసులను కలవరపెడుతోంది.

చిత్తూరు అర్బన్‌: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా గత నెల 20వ తేదీ నుంచి జిల్లాలో ఆంక్ష లు అమలవుతున్నాయి. మార్చి 22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించగా జిల్లా వాసులు సైతం ఇందులో పాల్గొని నిబద్ధతను చాటుకున్నారు. 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం కూడా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూ వస్తోంది. ప్రజాప్రతినిధుల నుంచి కలెక్టర్, ఎస్పీలు, పారిశుద్ధ్య సిబ్బంది, వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే క్రమంగా జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలు నడుచుకోవాల్సిన తీరును గుర్తుచేస్తోంది.

కేసులు ఇలా..
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్వీయగృహ నిర్బంధంలో ఉండకపోవడం, కొందరు విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులకు చెప్పకపోవడంతో జిల్లాలో కరోనా కేసుల పెరుగుదలకు దారితీస్తున్నాయి. మార్చి 24న శ్రీకాళహస్తిలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు వెలుగుచూసింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి స్వీయగృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. దాని తర్వాత క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం జిల్లాలో 17కు చేరుకున్నాయి. ఇందులో తిరుపతిలో అత్యధికంగా 5, శ్రీకాళహస్తి 3, రేణిగుంట 2, పలమనేరు 3, ఏర్పేడు 1, నగరి 2, నిండ్రలో ఒక కేసు నమోదయ్యాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు..
ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి కుటుంబ సభ్యులను, కలసిన వారిని క్వారంటైన్‌ చేయాలని కేంద్రం ఆదేశించింది.
రెడ్‌ జిల్లాల పరిధిలో హాట్‌స్పాట్లను గుర్తించి, వైరస్‌ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  
లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలి. అవసరమైతే జిల్లా పరిధిలో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరికొన్ని గంటలు పొడిగించాలి. రెడ్‌ జిల్లాల పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతున్నందున అత్యవసర క్వారంటైన్‌ కేంద్రాలు, ఆస్పత్రులను సిద్ధం చేయాలి.

జాగ్రత్త లేకుంటే కష్టమే..
కొందరు అవసరం లేకున్నా పిల్లలను, ఇంట్లోవాళ్లను స్కూటర్‌లో ఎక్కించుకుని రోడ్లు చూపిస్తూ ఆనందపడుతున్నారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి రాకూడదు.
నిత్యావసర వస్తువుల కోసం ఇంటి నుంచి ఒక్కరు వస్తే సరిపోతుంది. అది కూడా గంటలో ఇంటికి చేరుకోవాలి. ముఖానికి మాస్క్‌ తప్పనిసరిగా ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి.
ఇంట్లో బోర్‌ కొడుతోందని చేలల్లో క్రికెట్‌ ఆడటం, పెద్దలు కాలనీల్లో కూర్చుని పాచికలు ఆడటం, కొందరు యువకులు ఫ్రెండ్స్‌తో కూర్చుని పేకాట ఆడటం లాంటి దృశ్యాలు సామాజిక మాధ్యమా ల్లో దర్శనమిస్తున్నా యి. ఇలాంటి చర్యల వల్ల కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
ఎంత చెబుతున్నా కొందరు ఇప్పటికీ ప్రార్థనా మందిరాలకు గుంపులుగా వెళుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఉదయాన్నే 4 గంటలకు, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రార్థనా మందిరాలకు వెళుతున్నారు. పొరపాటున అక్కడకు వెళ్లే ఒక్కరికి పాజిటివ్‌ కేసు వచ్చినా చేయనితప్పునకు ఊరంతా శిక్ష అనుభవించాల్సి ఉంటుందనే విషయం గుర్తించుకోవాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

27-05-2020
May 27, 2020, 17:40 IST
‘స్టే హోమ్‌’ నోటీసులు ఉల్లంఘించి ఇతరులను ప్రాణాలకు రిస్కులో పెట్టినందుకు ఈ శిక్ష వేసింది
27-05-2020
May 27, 2020, 17:11 IST
అయితే, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, మతపరమైన సంస్థల ప్రారంభానికి కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం...
27-05-2020
May 27, 2020, 16:35 IST
సాక్షి, అమరావతి : మంగళగిరి ఎమ్మార్వో అమరావతి టీడీపీ కార్యాలయానికి కోవిడ్‌ నోటీసులు జారీచేశారు. మహానాడు సందర్భంగా కరోనా వైరస్‌ నివారణ...
27-05-2020
May 27, 2020, 16:22 IST
మెల్‌బోర్న్‌ : లాక్‌డౌన్‌ తర్వాత క్రికెట్‌ టోర్నీ ఆరంభమైతే బౌలర్లు తిరిగి ఫామ్‌ను అందుకోవడం కొంచెం కష్టమేనంటూ ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌...
27-05-2020
May 27, 2020, 15:29 IST
కరోనా కేసులు అధికంగా నమోదైన నగరాలపై లాక్‌డౌన్‌ 5.0 ఫోకస్‌
27-05-2020
May 27, 2020, 15:10 IST
సిమ్లా: కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకున్నందుకు గాను సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడితో పాటు ముగ్గురు కౌన్సిలర్లు, మరో 16...
27-05-2020
May 27, 2020, 15:09 IST
కరోనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పిన మాట నిజమైంది.
27-05-2020
May 27, 2020, 14:29 IST
సిమ్లా : కరోనాతో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అంత్యక్రియలను అడ్డుకున్నందుకు గాను హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతతో పాటు...
27-05-2020
May 27, 2020, 13:22 IST
ఒడిశా, కొరాపుట్‌: గంజాం జిల్లా జగన్నాథప్రసాద్‌ బ్లాక్‌ చడియపల్లి గ్రామం నుంచి జితేంద్ర పట్నాయక్‌ కుటుంబ పరివారంతో మార్చి 18న...
27-05-2020
May 27, 2020, 13:18 IST
తిరువనంతపురం : ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను తరలించేందుకు కేంద్ర ఏర్పాటు చేసిన శ్రామిక రైళ్ల నిర్వహణపై కేరళ ప్రభుత్వం...
27-05-2020
May 27, 2020, 13:15 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా  వివిధ మార్గాల్లో విమానాలను రద్దు చేస్తున్నట్టు  ప్రకటించింది.   కరోనా వైరస్ కారణంగా...
27-05-2020
May 27, 2020, 12:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. క‌రోనా వైర‌స్ సోకిందో...
27-05-2020
May 27, 2020, 11:51 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌-19 ప్రపంచ రూపురేఖలను మార్చేసిందంటున్నారు కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
27-05-2020
May 27, 2020, 11:44 IST
మహబూబ్‌నగర్‌ క్రైం/ నారాయణపేట: మరో సారి కరోనా కేసు నమోదు కావడంతో నారాయణపేట జిల్లాలో కలవరం చెందుతున్నారు. ఇంతవరకు ప్రశాంతంగా...
27-05-2020
May 27, 2020, 11:32 IST
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 68 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
27-05-2020
May 27, 2020, 11:11 IST
సాక్షి, న్యూఢిల్లీ / శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ ఆంక్షల...
27-05-2020
May 27, 2020, 09:57 IST
లక్నో: హెచ్‌ఐవీ పేషెంట్‌ ఒకరు కేవలం ఆరు రోజుల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ సంఘటన లక్నోలోని కింగ్‌...
27-05-2020
May 27, 2020, 09:32 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 కరోనా కేసులు నమోదు కాగా,...
27-05-2020
May 27, 2020, 09:16 IST
చెన్నై : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా.. దాదాపు రెండు నెలల తర్వాత భారత్‌లో దేశీయ విమాన సర్వీసులు పున: ప్రారంభమైన...
27-05-2020
May 27, 2020, 09:15 IST
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతుండటంతో ఉన్నతాధికారులు మేల్కొన్నారు. ప్రాధాన్యత క్రమంలో అధికారులు, సిబ్బందికి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top