ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్తో రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది.
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్తో రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. రాష్ట్రానికి వరద సాయం అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రూ. 1000 కోట్ల విడుదలకు కేంద్రం ఈ సందర్భంగా అనుమతించింది. అదే సమయంలో, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధాని మన్మోహన్ సింగ్కు మంత్రి శైలజానాథ్ వినతిపత్రం అందించారు.
ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు చిరంజీవి, పల్లంరాజు, రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, పార్థసారథి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు.