జగన్ హాజరుకు మినహాయింపు | CBI special court give exemption for YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

జగన్ హాజరుకు మినహాయింపు

Mar 19 2014 2:14 AM | Updated on Jul 25 2018 4:09 PM

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఉన్న దృష్ట్యా ఈనెల 21న కోర్టులో తన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక కోర్టు అంగీకరించింది.

 సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఉన్న దృష్ట్యా ఈనెల 21న కోర్టులో తన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక కోర్టు అంగీకరించింది. తన కంపెనీల్లో పెట్టుబడుల కేసులో ఈనెల 21న జగన్ సీబీఐ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో హాజరు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అనుమతిస్తూ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement