సీబీఐ విచారణతో రెవెన్యూ వర్గాల్లో కలకలం | CBI investigations into the categories of revenue caused outrage | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణతో రెవెన్యూ వర్గాల్లో కలకలం

May 7 2016 3:30 AM | Updated on Sep 3 2017 11:32 PM

సీబీఐ దాడులతో పెడన రెవెన్యూ వర్గాల్లో కలకలం రేగింది. తప్పుడు ధ్రువపత్రాలతో గుడివాడ ఆంధ్రా బ్యాంకు నుంచి....

తప్పుడు పత్రాలతో రూ.31.83 కోట్ల
రుణం పొందిన ఘనులు
బెంగళూరు నుంచి వచ్చి
దర్యాప్తుచేసిన సీబీఐ డీఎస్పీ

 

 పడన రూరల్ : సీబీఐ దాడులతో పెడన రెవెన్యూ వర్గాల్లో కలకలం రేగింది. తప్పుడు ధ్రువపత్రాలతో గుడివాడ ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.31.83 కోట్ల రుణాలు పొందిన వ్యక్తి పెడన మండలంలో చేపల చెరువులు ఉన్నట్లు చూపించిన వైనంపై కేసు నమోదైంది. విజయవాడకు చెందిన వీనస్ ఆక్వా ఫుడ్స్ ైప్రైవేటు లిమిటెడ్ యజమాని నిమ్మగడ్డ రామకృష్ణ, పెడన , బంటుమిల్లి, గుడివాడ, అవనిగడ్డకు చెందిన నలుగురు వ్యక్తులు గుడివాడ ఆంధ్రాబ్యాంకులో రూ.31.97 ఎకరాల చేపల చెరువులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి 2010లో రూ.31.83 కోట్లు రుణం పొందారు. హామీగా పెడన మండలం నందమూరు గ్రామం లజ్జబండ కాలువకు అనుకుని ఉన్న (నందమూరు నుంచి మడక మీదుగా బల్లిపర్రు వెళ్లే మార్గం) 31.97 ఎకరాల చేపల చెరువులను చూపించారు.

హామీ దారుల్లో ఒకరైన పామర్రు మండలానికి చెందిన ఆరేపల్లి వెంకటేశ్వరరావు కుమారుడు ఆరేపల్లి వెంకటనాగరమేష్, మరి కొందరి పేరుతో నందమూరులో 31.97 ఎకరాల చేపల చెరువులు ఉన్నట్లు అప్పటి వీఆర్వో కూనపురెడ్డి వీరమోహనరావు ధ్రువీకరించిన పత్రాలను బ్యాంకులో సమర్పించారు. ఈ పత్రాలు అసలైనవా? కావా? తేల్చాలంటూ బెంగళూరుకు చెందిన సీబీఐ అధికారులు ఏప్రిల్ ఆఖరి వారంలో పెడన తహసీల్దార్‌కు లేఖ పంపించారు. ఏప్రిల్ 29న బెంగళూరులోని తమ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. తహసీల్దార్ డి.వి.ఎస్.ఎల్లారావు ఆ రోజున డెప్యూటీ తహసీల్దార్ కుమార్‌ను బెంగళూరు పంపించారు.

కుమార్ అందించిన వివరాలను తీసుకుని సీబీఐ డీఎస్పీ బి.రవీంద్ర గురువారం సాయంత్రం పెడన వచ్చి, చేపల చెరువులున్న ప్రాంతంలో విచారణ చేశారు. అయితే ఆ చెరువుల సర్వే నంబర్లు వేరొకరి పేరుతో ఉండడంతో సీబీఐ డీఎస్పీ అవాక్కయ్యారు. మరి కొన్ని సర్వే నంబర్లు నందమూరులో లేవని స్థానిక వీఆర్వో రాజును విచారించిన సీబీఐ డీఎస్పీ బి.రవీంద్ర తెలుసుకున్నారు. ఆరేపల్లి వెంకట నాగరమేష్ తమ్ముడు, అన్నయ్య పేరుతో నందమూరులో చేపల చెరువులున్నట్లు గుర్తించారు. సీబీఐ విచారణ రెవెన్యూ వర్గాల్లో ఆందోళన రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement