దొంగలు అరెస్ట్ : భారీగా కార్లు స్వాధీనం | Car thieves arrested by the East godavari district police | Sakshi
Sakshi News home page

దొంగలు అరెస్ట్ : భారీగా కార్లు స్వాధీనం

Dec 16 2014 1:05 PM | Updated on Aug 28 2018 7:30 PM

వాహనాల చోరీ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును తూర్పు గోదావరి జిల్లా పోలీసులు మంగళవారం రట్టు చేశారు.

కాకినాడ: వాహనాల చోరీ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును తూర్పు గోదావరి జిల్లా పోలీసులు మంగళవారం రట్టు చేశారు. ముఠాకు చెందిన నలుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదుతోపాటు లారీ, టాటా ఇండికా కారు, ఐదు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా దొంగలను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement