టికెట్ల ధరల పెంపుపై మంత్రివర్గ భేటీ | Cabinet meeting on movie ticket price hike | Sakshi
Sakshi News home page

సినిమా టికెట్ల ధరల పెంపుపై మంత్రివర్గ సమావేశం

Jan 31 2018 5:16 PM | Updated on Aug 13 2018 4:22 PM

Cabinet meeting on movie ticket price hike - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల పెంపుపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు యనమల, చినరాజప్ప, నక్కా ఆనందబాబు ,సమాచార శాఖ కమీషనర్ వెంకటేశ్వర్ హాజరయ్యారు. సమాచార శాఖ కమీషనర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ..టికెట్ల ధరలు పెంచాలని థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ప్రజలపై ఎక్కువ భారం పడకుండా ధరలు పెంచే ఆలోచన ఉందన్నారు. జీఎస్టీ వచ్చాక థియేటర్లపై భారం పడిందని వెల్లడించారు. జీఎస్టీ తగ్గించాలని కౌన్సిల్‌కు లేఖ రాస్తానని చెప్పారు. వచ్చే నెల 14న టికెట్ల ధరలు ఎంత పెంచాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement